పిఠాపురంలో అంగరంగ వైభవంగా జరిగిన జనసేన ఆవిర్భావ సభ గురించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల చెప్పిందే.. నేడు నిజమైందన్నారు. పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మీటింగ్‌కు ఎక్కవ.. సభకి తక్కువ అంటూ సంచలన కౌంటర్ వేశారు.
ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో పవన్ కామెంట్స్ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చారు. ఆ మనిషి కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. జగన్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. పిఠాపురం సభలోనూ జనసేన నాయకులు జగన్ డైలాగ్‌ను పదే పదే గుర్తుచేసుకున్నారు.
Whatever Jagan said recently has come true today.
— PVS Sarma – పి వి ఎస్ శర్మ – પી વી એસ શર્મા (@pvssarma) March 14, 2025
Today’s meeting was,
“Meeting ki ekkuva Sabha ki takkuva.”








