చెన్నై సూపర్ కింగ్స్(CSK)పై 17 ఏళ్ల తర్వాత చెపాక్ స్టేడియం (Chepauk Stadium) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయం సాధించింది. ఈ అరుదైన గెలుపుతో ఆర్సీబీ ఆటగాళ్లు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా, విరాట్ కోహ్లీ 17 ఏళ్ల తరువాత సీఎస్‌కే జట్టును చెన్నై హోంగ్రౌండ్‌లో ఓడించి ఆనందంతో డ్యాన్స్ (Dance) చేశాడు.
డ్రెస్సింగ్ రూమ్‌లో డ్యాన్సింగ్
మ్యాచ్ అనంతరం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లారు. హనుమాన్‌కైండ్ (Run it Up) పాటకు స్టెప్పులేస్తూ, కోహ్లీ (Kohli) సహా మొత్తం జట్టు సందడి చేసింది. ఈ విజయం తమకు ఎంతో ప్రత్యేకమని ఆర్సీబీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.