టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్‌లో భారత్ ఆధిపత్యం

టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్‌లో భారత్ ఆధిపత్యం

భారత్ టీ20 వరల్డ్ కప్‌లో ఘన విజయం సాధించి మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. మూడోసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్పును (ICC T20 World Cup) కైవసం చేసుకున్న ఏకైక టీమ్‌గా భారత జట్టు (India Team) నిలిచింది. అంతేకాదు.. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన అంతర్జాతీయ టీ20 ర్యాంకుల్లోనూ (International T20 Rankings) టీమిండియా ప్లేయర్లు చోటు సాధించారు. ఈ మెగా టోర్నీలో మన ఆటగాళ్ల వీరోచిత ప్రదర్శన తాజాగా విడుదలైన టీ20 ర్యాంకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో (Batting Category) టాప్-2 స్థానాలను టీమిండియానే కైవసం చేసుకుంది.

ఈ సీజన్‌లో తన ఫామ్‌పై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ (Abhishek Sharma) టాప్‌ 1 స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో 317 పరుగులతో చెలరేగిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) రెండు స్థానాలు ఎగబాకి సెకండ్ స్థానంలోకి చేరాడు. వీరిద్దరి మధ్య కేవలం నాలుగు రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ఇక ఈ సీజన్‌లో ఎంతో ప్రతిభ కనబరిచిన సంజు శామ్సన్ (Sanju Samson) 22వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. శివమ్ దూబే (Shivam Dube) 27వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇక బౌలింగ్ విభాగంలో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. నంబర్ వన్ స్థానంలో ఉన్న వరుణ్ చక్రవర్తి రెండో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్థాన్ స్టార్ రషీద్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఆరో స్థానానికి చేరుకున్నాడు. అక్షర్ పటేల్ 17 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతర దేశాల ఆటగాళ్ల విషయానికి వస్తే, సెమీఫైనల్లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించిన కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ 20వ స్థానానికి చేరుకోగా, ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బెథెల్ ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకును దక్కించుకున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment