విజయ్ టీజర్ అదుర్స్.. – రష్మిక కామెంట్ వైరల్

విజయ్ టీజర్ అదుర్స్.. - రష్మిక కామెంట్ వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజా సినిమా టీజర్ వ‌చ్చేసింది. గౌతమ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు. ఇన్నాళ్ల స‌స్పెన్స్ త‌రువాత ఈ సినిమాకు కింగ్‌డమ్ (Kingdom) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ రివీల్‌తో పాటు టీజర్‌ (Kingdom Teaser)ను కూడా బుధ‌వారం విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్‌ అందించారు. మాస్ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్ టీజ‌ర్‌ రౌడీ బాయ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

కాగా, కింగ్‌డ‌మ్ టీజ‌ర్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు. టీజర్ చూసిన రష్మిక విజయ్ దేవరకొండపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఈ వ్యక్తి ప్రతిసారీ ఏదో ఒక అద్భుతమైన స్టోరీతో అలరించేందుకు సిద్ధమవుతుంటాడు” అంటూ విజయ్ టాలెంట్‌ను ప్రశంసించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య బంధం గురించి చర్చించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment