మాతృభాషలోనూ తడబాటు.. వివాదాల్లో ‘పెద్ది’ స్పీచ్‌లు

మాతృభాషలోనూ తడబాటు.. వివాదాల్లో 'పెద్ది' స్పీచ్‌లు

వెండితెరపై డైలాగులు చెబితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. కానీ అదే గ్లోబల్ స్టార్ రియల్ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుంటే మాత్రం అడుగులు తడబడుతున్నాయి.. మాటలు పొరబడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) ప్రమోషన్ల వేళ.. ఆయన చేసిన వరుస ప్రసంగాలు (Speeches) ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ హై-వోల్టేజ్ డ్రామాకు తెరలేపాయి. చిన్నప్పటి నుంచి మాట్లాడే మాతృభాష తెలుగులోనూ చరణ్ తడబడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల భోపాల్‌లో నిర్వహించిన ‘పెద్ది’ (Peddi) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో (Pre-Release Event) రామ్‌చరణ్ మాట్లాడిన మాటలు నెటిజన్లకు పెద్ద అస్త్రంగా దొరికాయి. వేదికపై మాట్లాడుతున్న తరుణంలో ఆయన భోపాల్ (Bhopal) అనబోయి ‘బిహార్'(Bihar) అని పలికారు. అంతటితో ఆగకుండా, ప్రముఖ భారతీయ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గురించి ప్రస్తావిస్తూ ఆయనను ‘ఫుట్‌బాల్ ఆటగాడు'(Football Player) అని తప్పుగా సంబోధించారు.

ఈ తడబాటుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంతో రామ్‌చరణ్ వెంటనే స్పందిస్తూ.. బుమ్రాకు సారీ చెబుతూ ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. అయితే అటు బుమ్రా నుంచి దీనిపై ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కానీ, కొందరు నెటిజన్లు మాత్రం రామ్‌చరణ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చేలా “నో ప్రాబ్లం యశ్ భాయ్.. నేను నీకు పెద్ద ఫ్యాన్‌ని. మీ ‘టాక్సిక్’ (Toxic) మూవీ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని స్క్రీన్ షాట్లను, ఫొటోలను క్రియేట్ చేసి వైరల్ చేశారు.

విజయవాడ ఈవెంట్‌లోనూ తడబాటు
భోపాల్ తడబాటు మరువకముందే.. విజయవాడలో జరిగిన ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రామ్‌చరణ్ మాతృభాష తెలుగులోనే(Telugu) మాట్లాడలేక తీవ్రంగా తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఆయన ‘వెన్నంటి ఉంటాం’ అనే అర్థంలో మాట్లాడబోయి, పొరపాటున ‘వెన్నుపోటు’ అనే పదాన్ని వాడటం ఒక్కసారిగా సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ‘వెన్నుపోటు’ అనే పదానికి ఎంతటి సెంటిమెంట్, వివాదాస్పద చరిత్ర ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘వెన్నంటి’ అనే పదానికి, ‘వెన్నుపోటు'(Backstab) అనే పదానికి మధ్య ఉన్న నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా చరణ్‌కు తెలియంది కాదు. అయితే ఫ్లోలో దొర్లిన ఈ పదాన్ని ఆయన వెంటనే గమనించి నాలుక కరుచుకుని సరిదిద్దుకున్నప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక భారీ బడ్జెట్ సినిమా ప్రమోషన్ల సమయంలో హీరో ఇలా వరుసగా వేదికలపై తడబడటం సినిమా హైప్‌ను పక్కదారి పట్టించి, అనవసర వివాదాల్లోకి నెడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment