“దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు” – రకుల్ సంచలన వ్యాఖ్య

"దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు" – రకుల్ సంచలన వ్యాఖ్య

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆ త‌రువాత వ‌రుస అవ‌కాశాల‌తో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో దూసుకుపోయింది. స్టార్ డ‌మ్ రాగానే పెళ్లి చేసుకొని అనూహ్యంగా టాలీవుడ్‌కు దూర‌మైంది. అయితే గ‌త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విప‌రీత‌మైన ప్ర‌చారాలు చేశారు.

సోష‌ల్ మీడియా ట్రోలింగ్స్‌పై ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సినీ ప్రముఖులపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారు, అబద్దపు పోస్టులతో ఎంజాయ్ అయ్యే వారు నిజంగా పనికిమాలినవాళ్లేనని ఆమె కఠినంగా వ్యాఖ్యానించారు. “ఈ రోజుల్లో సోషల్ మీడియా అందరి చేతిలో ఉంది. కానీ దురదృష్టకరంగా చెప్పాలంటే… మన దేశంలో చాలా మందికి చేసే పనిలేక‌ ఇతరుల జీవితాల్లోకి తొంగిచూస్తున్నారు. పిచ్చిపిచ్చి కామెంట్లు చేయడం వాళ్లకు అలవాటైపోయింది. నాకైతే ఇది పూర్తిగా నెగెటివ్ ఎనర్జీలా అనిపిస్తోంది” అని రకుల్ అన్నారు.

సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను గూర్చి ఆడపడుచులు లేకుండా మాట్లాడే వాళ్లపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు చాలా మందికి ఆలోచన కలిగిస్తున్నాయి. అభిమానులు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, కొంతమంది నెటిజన్లు ఈ వ్యాఖ్యలను చర్చించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment