పుష్ప సినిమా (Pushpa Movie) పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది రికార్డులే (Records). థియేటర్ల (Theatres)లో ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ఓటీటీ(OTT)లో అడుగుపెట్టినా, కొన్ని వారాల పాటు టాప్ ట్రెండింగ్ (Top Trending)లో కొనసాగింది. ఇప్పటికీ పలు షోలు, కార్యక్రమాల్లో ‘పుష్పరాజ్’ (Pushparaj) పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా, ఈ సినిమా బాలీవుడ్ (Bollywood)లో మరో సంచలనానికి కారణమైంది.
టీవీలోనూ ‘పుష్ప 2’ రికార్డులు
థియేటర్లలో, ఓటీటీలో అద్భుతమైన స్పందన పొందిన ‘పుష్ప 2’ ఇప్పుడు బుల్లితెరపై కూడా రికార్డు సృష్టించింది. ఇటీవల టీవీలో ప్రసారమైన ఈ సినిమా హిందీ వెర్షన్‌కు దేశవ్యాప్తంగా ఏకంగా 5.1 టీఆర్పీ వచ్చిందట. ఇది ఐపీఎల్ సగటు టీఆర్పీ కంటే ఎక్కువ కావడం విశేషం. థియేటర్లతో పాటు టీవీల్లోనూ మంచి స్పందన పొందిన ‘స్త్రీ 2’ సహా చాలా హిందీ చిత్రాలను టీఆర్పీ విషయంలో ‘పుష్ప 2’ అధిగమించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
‘పుష్ప 3’ ఖాయమేనా?
దాదాపు 5.4 కోట్ల మంది హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను చూసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, జూన్ 29న ఆదివారం రీలోడెడ్ హిందీ వెర్షన్‌ను టీవీ (TV)లో ప్రసారం చేయనున్నారు. ఈసారి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా చూస్తుంటే, ఇప్పుడే కాకపోయినా కొన్ని రోజుల తర్వాతైనా ‘పుష్ప 3’ తీయడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే ‘పుష్ప’ అనేది కేవలం సినిమా పేరు కాదు, నార్త్‌లో అదొక బ్రాండ్‌గా మారింది.
అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్
అల్లు అర్జున్ (Allu Arjun) విషయానికొస్తే, ప్రస్తుతం అట్లీ (Atlee) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన సూపర్‌హీరో తరహా పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే దీపికా పదుకొణె (Deepika Padukone)ను హీరోయిన్గా ప్రకటించారు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా ఈ సినిమాలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ అట్లీ మాట్లాడుతూ, ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రమని చెప్పి అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. మరి ఈ కొత్త సినిమాతో అల్లు అర్జున్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.