అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం

అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా 1871 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఫిల్మ్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లోనూ భారీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు, అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ మేగజీన్ “ద హాలీవుడ్ రిపోర్టర్” ఇండియా సంచిక కవర్ పేజీపై ఆయన ఫోటో ప్రింట్ అయ్యింది. ఇది అల్లు అర్జున్ అభిమానులకు నిజంగా శుభ‌వార్త.

“అల్లు అర్జున్ ది రూల్” అనే ప్రత్యేక క్యాప్షన్‌తో ఈ మేగజీన్ ఫొటోను ప్రచురించింది. అంతేకాదు, ఈ మేగజీన్ టీమ్ ప్రత్యేకంగా అల్లు అర్జున్‌పై ఫోటోషూట్ కూడా నిర్వహించింది. దీనికి సంబంధించిన “బిహైండ్-ది-సీన్స్” వీడియో ఇటీవల విడుదల కాగా, అది కూడా వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “ఇది నా జీవితంలో చాలా పెద్ద అవకాశం. మన బలం, మన ఆత్మవిశ్వాసం మనలోనే ఉంటాయి, ఎవరూ వాటిని తొలగించలేరు. విజయానికి గర్వం అడ్డంకి అవకూడదు” అని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment