ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ విశ్వరూపం

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ విశ్వరూపం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా పంజాబ్ కింగ్స్ (PBKS) ఈ సీజన్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓటమి అనేది లేకుండా వరుస విజయాలు సాధించి, ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. సీజన్ ప్రారంభంలో ఆడిన మొదటి 6 మ్యాచ్‌లలో విజ‌యాలు సాధించిన తొలి జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది.

పాయింట్ల పట్టికలో నంబర్ వన్
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పంజాబ్‌కు ఒక పాయింట్ లభించింది. దీనితో మొత్తం 11 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తిరుగులేని అగ్రస్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న పంజాబ్, ఈసారి కచ్చితంగా కప్పు కొట్టేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మిగతా జట్ల పరిస్థితి ఇలా..
పంజాబ్ తర్వాతి స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4 జట్లుగా పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లు (1వ స్థానం), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8 పాయింట్లు), రాజస్థాన్ రాయల్స్ (8 పాయింట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (6 పాయింట్లు) ఉన‌నాయి.

కష్టాల్లో ముంబై ఇండియన్స్..
ఒకప్పుడు ఐపీఎల్‌ను శాసించిన ముంబై ఇండియన్స్ పరిస్థితి ఈ సీజన్‌లో దారుణంగా తయారైంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసిన ముంబై, కేవలం 2 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. స్టార్ ప్లేయర్లు ఫామ్ కోల్పోవడం, జట్టు సమన్వయం లోపించడం ముంబై కొంపముంచుతోంది. మొత్తానికి పంజాబ్ కింగ్స్ జోరు చూస్తుంటే, ఈ సీజన్‌లో మిగిలిన జట్లు ఆ జట్టును అడ్డుకోవడం సవాల్‌గా మారేలా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment