పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఉగాది పండుగ వేళ వైసీపీ శుభ‌వార్త అందింది. వైసీపీ సీనియర్ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది. టీడీపీ నేతల జంట హత్యల ఆరోప‌ణ‌ల‌ కేసులో ఆయనకు గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత 98 రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి, కోర్టు ఆదేశాల మేర‌కు విడుదల కానున్నారు.

కేసులపై న్యాయ పోరాటం
ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను పురస్కరించుకుని, టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించారని వైసీపీ శ్రేణులు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను జైలుకు పంపారని, సాక్ష్యాధారాలు లేకపోయినా వేధించారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి దాదాపు మూడు నెలలకు పైగా (98 రోజులు) నెల్లూరు సెంట్రల్ జైలులోనే గడిపారు. కోర్టు ఆదేశాలతో పిన్నెల్లి అభిమానులు, మాచర్ల నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment