పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. మధ్యంతర బెయిల్ పై సాగుతున్న విచారణలో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఆధ్వర్యంలోని బెంచ్, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలను పరిశీలించిన ధర్మాసనం, విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను కూడా నిందితులు పాటించలేదని పేర్కొంది. అంతేకాక, ఈ కేసులో కస్టోడియల్ దర్యాప్తు తప్పనిసరిగా అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. సెక్షన్ 161 కింద నమోదు చేసిన విచారణ సంబంధిత డాక్యుమెంట్లు నిందితుల చేతికి ఎలా చేరాయో కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది.

పిన్నెల్లి సోదరుల తరఫు న్యాయవాదులు లొంగిపోవడానికి రెండు వారాల సమయం ఇవ్వాలని కోరగా, ముందస్తు బెయిల్ అంశంలో సమయం ఎలా ఇస్తామంటూ జస్టిస్ సందీప్ మెహతా వ్యాఖ్యానించారు. నిందితుల అరెస్టుకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉందని బెంచ్ స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో పోలీసులు నిందితులకు పూర్తి సహకారం అందిస్తున్నారు అని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుతో పల్నాడు జంట హత్యల కేసులో దర్యాప్తు వేగవంతం కానున్నట్టు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment