అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) చరిత్ర (History)లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ప్రస్తుత ఐర్లాండ్ (Ireland) ఆటగాడు పీటర్ మూర్ (Peter Moor) ఒకరు. 34 ఏళ్ల చిన్న వయసులోనే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు (Farewell) పలికి మూర్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐర్లాండ్ తరఫున ప్రపంచకప్ ఆడాలనే కలతో ఆ దేశానికి వలస వెళ్ళిన మూర్, ఆ కోరిక తీరకుండానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం గమనార్హం.
జింబాబ్వే నుంచి ఐర్లాండ్‌కు..
ఐర్లాండ్‌కు ఆడకముందు పీటర్ మూర్ జింబాబ్వే జట్టులో సభ్యుడు. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున అరంగేట్రం చేసిన మూర్, ఆ తర్వాత జింబాబ్వే ఆల్-ఫార్మాట్ ప్లేయర్‌గా మారాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ కమ్ వికెట్‌కీపర్ అయిన మూర్ జింబాబ్వే తరఫున 49 వన్డేలు, 21 టీ20లు, 8 టెస్ట్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 10 అర్ధ సెంచరీల సాయంతో 1700కు పైగా పరుగులు సాధించాడు.
అనంతరం, ఐరిష్ మూలాలు (నానమ్మ) ఉండటంతో మూర్ ఐర్లాండ్‌కు వలస వెళ్ళాడు. 2023లో ఐర్లాండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి, ఆ దేశం తరఫున 7 టెస్ట్‌లు ఆడాడు. ఐర్లాండ్ తరఫున అతని అత్యుత్తమ ప్రదర్శన 2024 జూలైలో నమోదైంది. ఆ మ్యాచ్‌లో మూర్ తన జన్మదేశమైన జింబాబ్వేపై 79 పరుగులు చేశాడు.
చివరి మ్యాచ్‌లు, కెరీర్ ముగింపు
పీటర్ మూర్ చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది కూడా జింబాబ్వేపైనే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అతను 4, 30 పరుగులు చేశాడు. ప్రొఫెషనల్ కెరీర్‌లో మూర్ తన చివరి మ్యాచ్‌ను నిన్ననే (జులై 10, 2025) ఆడాడు.
ఐరిష్ దేశవాళీ టోర్నీలో మన్‌స్టర్ రెడ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మూర్, వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతని జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో మూర్ సహచరుడు కర్టిస్ క్యాంఫర్ 5 వరుస బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. పీటర్ మూర్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికినా, దేశవాళీ, టీ20 లీగ్‌ల్లో మాత్రం కొనసాగుతానని ప్రకటించాడు.
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్