తనకు జారీ చేయబడిన నోటీసులను క్వాష్ చేయాలని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించారని ఆరోపిస్తూ పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కేసు బనాయించింది. ఇందులో పేర్ని నాని భార్య జయసుధను ఏ1గా చేర్చుతూ కేసు నమోదు చేసింది.
కాగా, రెండ్రోజుల క్రితం పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) విచారణకు హాజరుకావాలని రాబర్ట్‌సన్‌పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. తమ దగ్గర ఉన్న సమాచారంతో మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఆ నోటీసులను క్వాష్ చేయాలని పేర్ని నాని, పేర్ని కిట్టు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
పేర్ని నాని పిటీషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరగనుంది. అదే విధంగా ఆయన సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు జిల్లా కోర్టులో విచారణ జరగనుంది.