“చంద్రబాబుపై ప్రకృతి తిరగబడుతుంది” – పేర్ని నాని సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

“చంద్రబాబుపై ప్రకృతి తిరగబడుతుంది” – పేర్ని నాని సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

భార‌త‌ దేశంలో తప్పుడు, కుట్రపూరిత రాజకీయాలకు (Conspiratorial Politics) సీఎం చంద్రబాబే (Chandrababu) మార్గదర్శకుడని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. పదవుల కోసం డబ్బు రాజకీయాలు మొదలుపెట్టి ప్రజాస్వామ్య విలువలను (Democratic Values) కించపరిచిన నాయకుడు చంద్రబాబేనని నాని విమర్శించారు. డబ్బులు ఇచ్చి రాజీనామాలు చేయించడం, తర్వాత ఆ పదవులను తమ అనుకూలులకు పంచడం టీడీపీ (TDP) ప్రభుత్వంలో సాధారణమైందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పేర్ని నాని మాట్లాడుతూ.. బెయిల్‌పై ఉన్నప్పటికీ చంద్రబాబు వైద్యం పేరుతో కోర్టును తప్పుదోవ పట్టించి ఆసుపత్రికి కూడా వెళ్లలేదన్నారు. తనపై ఉన్న అవినీతి కేసులను అధికార దుర్వినియోగంతో మూయించుకుంటున్నారని, అధికారులు, ఫిర్యాదుదారులను బెదిరించి కేసులు ఉపసంహరించేలా చేస్తున్నారని ఆరోపించారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వంటి విలువలన్నీ చంద్రబాబుకు సంబంధం లేని విషయాలని నాని అన్నారు. చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌కృతి తిర‌గ‌బ‌డుతుంద‌ని, “దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్నంత మాత్రాన‌ పునీతుడు కాలేరని, ప్రకృతి తిరగబడి.. ఇవే కోర్టులు చంద్రబాబును జైలుకు పంపుతాయని చెప్పారు.

అమరావతి (Amaravati) రాజధాని (Capital) అంశంపై కూడా పేర్ని నాని మండిపడ్డారు. పరిశ్రమలు వైజాగ్‌ వైపు వెళ్తున్నప్పటికీ అమరావతిలో అభివృద్ధి లేకపోవడానికి టీడీపీ (TDP) ప్రభుత్వమే కారణమని చెప్పారు. రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూసమీకరణ చేస్తామన్న టీడీపీ మాటలు ప్రజలను ఎగతాళి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. లోకేష్‌ విమానయాన ఖర్చులపై నాని ప్రశ్నలు లేవనెత్తుతూ, వారానికి లక్షల రూపాయల ఖర్చు ఎవరు భరించుతున్నారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలని డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్‌పై కూడా పేర్ని నాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పవన్ సినిమాలు కనీసం మ్యాట్నీ షోకైనా ప్రేక్షకులను ఆకర్షించడం లేదని, నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీడీపీ-జనసేన జత కలిసి ప్రచారం చేసే విషపు అబద్ధాలను ప్రజలు నమ్మడం ఆపారని, త్వరలోనే ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారని నాని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment