అమరావతిలో ‘వ్యవస్థీకృత వివక్ష’.. – బాబు ప్యాలెస్ కోసం క్విడ్ ప్రో కో

అమరావతిలో 'వ్యవస్థీకృత వివక్ష'.. - బాబు ప్యాలెస్ కోసం క్విడ్ ప్రో కో

అమరావతి (Amaravati) అభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఆంధ్రరాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారా..? రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి, చంద్ర‌బాబు బినామీలకు మరో నీతి అమలు చేస్తూ ‘వ్యవస్థీకృత వివక్ష'(Systematic Discrimination)కు తెరలేపారా అంటే అవున‌నే అంటున్నాయి వైసీపీ(YSRCP) వ‌ర్గాలు. అందుకు సంబంధించిన ఆధారాల‌ను సైతం వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) బ‌య‌ట‌పెట్టారు. మీడియా సమావేశంలో ఆయన అమ‌రావ‌తిలో ప్లాట్ల కేటాయింపున‌కు (Amaravati Plot Allocations) సంబంధించిన ప‌లు ఆధారాల‌ను బ‌హిర్గ‌తం చేశారు.

చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం రాజధాని నిబంధనలను ఎలా తుంగలో తొక్కుతున్నారో పేర్ని నాని వివరించారు. “కోర్ కేపిటల్ (Core Capital) పరిధిలోని E-6 రోడ్డులో 5.17 ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు తన నివాసాన్ని, కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నారు. సుమారు లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో మూడు అంతస్తుల్లో ఈ ‘ప్యాలెస్(Palace)’ నిర్మాణం శరవేగంగా సాగుతోంది.”

“నక్కపల్లిలో(Nakkapalli) రూ. 600 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్ట్ పొందిన అట్లూరు శ్రీనివాసే (Atluri Srinivas) చంద్రబాబు ఇంటిని నిర్మిస్తున్నారు. ఇది క్విడ్ ప్రో కో కాదా?” అని ఆయన ప్రశ్నించారు. ఏడాదిలోనే బాబు ఇంటి సివిల్ పనులు పూర్తవుతుంటే, రాజధాని భవనాలు మాత్రం ఎందుకు అద్దాల పేరుతో గాలికి వదిలేశారని నిలదీశారు.

చంద్రబాబు అమరావతిని ఒక అప్పుల ఊబిగా మార్చారని నాని విమర్శించారు. “గజం రూ. 7500 చొప్పున ప్రభుత్వం దగ్గరున్న 5 వేల ఎకరాలు అమ్మినా రూ. 20 వేల కోట్లు కూడా రావు. కానీ ఇప్పటికే అమరావతి పేరుతో రూ. 50 వేల కోట్లు అప్పు చేశారు. 8 నుంచి 10 శాతం వడ్డీకి తెస్తున్న ఈ అప్పులు ఎప్పటికి తీరుస్తారు?”

సీఆర్‌డీఏ(CRDA) నిబంధనలు సామాన్య రైతులకు సంకెళ్లుగా మారాయని, కానీ బాబు అనుచరులకు మాత్రం వరాలుగా మారాయని నాని విమర్శించారు.ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబం నీరుకొండలో భూమి ఇస్తే, సచివాలయం పక్కన అద్భుతమైన ప్రైమ్ లోకేషన్లలో ప్లాట్లు ఇచ్చారు. బెజవాడ రమేష్ అనే వ్య‌క్తికి బీట్స్ పిలానీ, కొత్త సచివాలయం, సీడ్ యాక్సిస్ రోడ్డు ఆనుకుని వేల గజాల కమర్షియల్ ప్లాట్లు కేటాయించారు. తుళ్లూరు మండలానికి చెందిన టీడీపీ సుబ్బారావుకు హైకోర్టుకు సమీపంలో, చంద్రబాబు ఇల్లు కనిపించేలా 24,500 గజాల భారీ ప్లాట్లు ఇచ్చారు.

“సామాన్య రైతులకు (Ordinary Farmers) వెస్ట్ బైపాస్ పక్కన ఎక్కడో ప్లాట్లు ఇస్తున్నారు. కానీ బాబు బినామీలకు మాత్రం సచివాలయం, హైకోర్టు పక్కనే కేటాయిస్తున్నారు. అడిగితే కేంద్ర మంత్రి గెటవుట్ అంటున్నాడు. రైతుల కర్మ ఇలా ఏడ్చింది” అని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు తన ఇంటి పక్కన రైతులు ఉండకూడదని 3800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే ‘గ్రీన్ బెల్ట్'(Green Belt)గా మార్చేశారని ఆయన ఆరోపించారు.

రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో చంద్రబాబుకే తెలియదని, ఈ మొత్తం వ్యవహారం కేవలం కొంతమంది వ్యక్తుల ఆర్థిక ప్రయోజనాల కోసమే జరుగుతోందని పేర్ని నాని అనుమానం వ్య‌క్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment