ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన(Jana Sena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆరోగ్య పరిస్థితి అటు రాజకీయ వర్గాల్లో, ఇటు జనసైనికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొన్ని వారాలుగా ఆయన వరుసగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో(Hyderabad) ముక్కు కండరాలకు (Nasal Muscles) శస్త్రచికిత్స (Surgery) చేయించుకుని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న పవన్.. ఆ తర్వాత జరిగిన క్యాబినెట్ భేటీలకూ హాజరైనా తీవ్రమైన వెన్నునొప్పి (Back Pain) కారణంగా మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. తాజాగా ఆయన భుజాల కండరాల అత్యవసర వైద్య పరీక్షల కోసం ముంబై వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ ముంబైలోని (Mumbai) ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో (Kokilaben Dhirubhai Ambani Hospital) ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన రెండు భుజాలను పరీక్షించిన వైద్యులు ‘రొటేటర్ కఫ్'(Rotator Cuff) తో పాటు భుజానికి సంబంధించిన రెండు ప్రధాన కండరాల్లో గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, అవి చిట్లిపోయాయని తేల్చారు. దీనికి తక్షణమే శస్త్రచికిత్స అవసరమని స్పష్టం చేశారు.
వెంటనే సర్జరీ చేయించుకోవాలని వైద్యులు ఒత్తిడి తెచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో పాలనాపరమైన, ముందస్తుగా ఖరారైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే తాను శస్త్రచికిత్స చేయించుకుంటానని చెప్పారట.
అసలు పవన్ కళ్యాణ్ భుజాలు అంత తీవ్రంగా గాయపడటానికి కారణం ఎవరు? దీనికి సమాధానం స్వయంగా పవన్ కళ్యాణే గతంలో ఒక జనసేన సమావేశంలో హింట్ ఇచ్చారు. తన భుజాలు, చేతులు ఈ స్థాయికి రావడానికి అభిమానుల అతి ప్రేమే కారణమని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.
అభిమానులు (Fans), కార్యకర్తలు (Party Workers) తన చేతులను పట్టుకుని బలంగా లాగడం, తోపులాట జరగడం వల్ల భుజాల కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడిందని అప్పట్లో పవనే చెప్పారు. ఒకవైపు ముక్కు శస్త్రచికిత్స, మరోవైపు వెన్నునొప్పి, ఇప్పుడు రెండు భుజాల కండరాలు చిట్లిపోవడం వంటి వరుస అనారోగ్య సమస్యలు జనసైనికులను, అభిమానులను కలవరపెడుతున్నాయి. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.








