మంత్రి దుర్గేష్‌పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం!

మంత్రి దుర్గేష్‌పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం!

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (Rajamahendravaram) పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) త‌న పార్టీకి చెందిన మంత్రిపై సీరియ‌స్ అయ్యారు. గోదావరి నది కాలుష్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజమండ్రి రూరల్ పరిధిలోని వెంకటనగరంలో స్థానిక ఏపీ పేపర్ మిల్లు (AP Paper Mill) నుంచి నదిలోకి వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతాన్ని ప‌వ‌న్ పరిశీలించారు. అక్కడ భారీగా పేరుకుపోయిన కాలుష్యాన్ని చూసి మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను అక్కడికక్కడే నిలదీశారు.

పుణ్యం కాదు.. రోగాలు రావడం ఖాయం
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పేపర్ మిల్లు (Paper Mill) వ్యర్థాలు విషంలా కలుస్తున్న గోదావరి నదిలో భక్తులు పుష్కర స్నానాలు చేస్తే పుణ్యం రావడం దేవుడెరుగు.. రోగాలు రావడం మాత్రం ఖాయమ‌న్నారు. ఎస్టీపీ (STP – Sewage Treatment Plant) ప్లాంట్లు ఏర్పాటు చేయకుండా, మురుగునీటిని శుద్ధి చేయకుండా.. కేవలం పుష్కర ఘాట్లను సుందరీకరిస్తే సరిపోతుందా? అని మంత్రి దుర్గేష్‌ను నిలదీశారు.

పేపర్ మిల్లు నుంచి భారీగా వ్యర్థాలు నదిలోకి చేరుతున్నా పట్టించుకోకపోవడంపై మిల్లు నిర్వాహకులతో పాటు జిల్లా యంత్రాంగంపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రితో (CM) సమావేశమైనప్పుడు ఇటువంటి తీవ్రమైన పర్యావరణ సమస్యలను సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదు? అని కలెక్టర్‌ను నిలదీశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment