వెండితెరపై టాలీవుడ్ పవర్ స్టార్ (Power Star) ను చూసి చాలాకాలమైంది. పవన్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. పవన్ సినిమా (Pawan’s Movie) కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మూడు ప్రధాన సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu), ఓజీ (OG), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.
గుడ్‌న్యూస్ ఏంటంటే..
హరిహర వీరమల్లు సినిమాను నాలుగేళ్ల క్రితమే ప్రారంభించారు. పలు కారణాల వల్ల వాయిదా పడిన ఈ చిత్రాన్ని మే 9న విడుదల (Release) చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఇంకా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు పెండింగ్ (Scenes Pending)లో ఉన్నాయని సమాచారం. తాజా సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ వచ్చే నాలుగైదు రోజుల్లో షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని, ఏకంగా 10 రోజుల టైమ్ కేటాయించారని వార్తలు వస్తున్నాయి. దీంతో షూటింగ్ పూర్తయితే సినిమా త్వరలో విడుదల కానుందని అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
బ్యాడ్ విషయానికొస్తే..
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. కానీ హరిహర వీరమల్లు పూర్తయ్యే వరకూ పవన్ మరో ప్రాజెక్ట్‌కు టైం ఇవ్వలేరని తెలుస్తోంది. ఇలా అయితే ఓజీ (OG) పూర్తయ్యేందుకు కనీసం మరో రెండు మూడు నెలలు (2–3 Months) పట్టేలా ఉంది. అందుకే ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల అవుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే హరీష్ శంకర్ (Harish Shankar) దే ఓ మాట, దేవుడే ఓ మాట అన్నట్లుగా అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమా విడుదలపై స్పష్టత లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.