“ఎమ్మెల్యే దగ్గుబాటి నుంచి ప్రాణహాని” – ధనుంజయ

ntr-fan-alleges-life-threat-from-tdp-mla-daggubati

జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం రూరల్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ అభిమాని, అనంతపురం జిల్లా TNSF అధ్యక్షుడు ధనుంజయ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందని, కాల్ రికార్డింగ్ ఫేక్ అని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పమని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“నా అభిమాన హీరో, ఆయన తల్లి గురించి అసభ్యంగా మాట్లాడారు కాబట్టే ఆ ఆడియోలు బయట పెట్టాల్సి వచ్చింది. కానీ నా వెనక ఎవరో ఉన్నారని, డబ్బులు తీసుకున్నానని చెప్పడం పూర్తిగా తప్పుడు ప్రచారం మాత్రమే. నేను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు. ఎమ్మెల్యే దగ్గుబాటి నుంచి నాకు ప్రాణహాని ఉంది” అని ధనుంజయ స్పష్టం చేశారు. తనకు రక్షణ కల్పించి, ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ పరిణామాలతో టీడీపీ అంతర్గతంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు, ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment