టాలీవుడ్‌లో “గాడ్ ఆఫ్ మాసెస్” (God of Masses) అనే బిరుదుకు సరైన అర్హుడు ఎవరంటే అభిమానులు ఏకగ్రీవంగా చెప్పే పేరు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). మూడు దశాబ్దాలకుపైగా మాస్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న బాలయ్య, ప్రతి తరానికి తనదైన శైలిలో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్ (Lorry Driver), సమరసింహారెడ్డి (Samarasimha Reddy) వంటి చిత్రాలతో మాస్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన ఆయన, ఆ తర్వాత కూడా వరుసగా భారీ విజయాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాలయ్య మాస్ ఇమేజ్‌ను మరింత బలపరిచాయి.
ఇక తాజాగా విడుదలైన NBK111 టీజర్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు గోపిచంద్ మాలినేని (Gopichand Malineni) ఈసారి వింటేజ్ బాలయ్యను కాకుండా, న్యూ ఏజ్ మాస్ అవతార్‌లో చూపిస్తూ అభిమానులకు కొత్త అనుభూతిని అందించాడు. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, అలాగే సంగీత దర్శకుడు తమన్ (S. Thaman) అందించిన ఎలివేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరింత హైలైట్ చేశాయి. దీంతో NBK111పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్ అనే మాటను మరోసారి ఈ టీజర్ (Teaser) నిరూపించిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.








