నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. .. వీడియో

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Summarize with AI

అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంట‌ర్మీడియ‌ట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ జరుగుతున్న సమయంలో చరణ్ అక‌స్మాత్తుగా బయటకు వచ్చి, మూడో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు.

అతడిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండ‌గా, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. చరణ్ స్వస్థలం రామాపురంగా గుర్తించారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ ఘోరమైన ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు.

మృతిపై కుటుంబ సభ్యుల ఆవేద‌న
చరణ్ ఆత్మహత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చ‌ర‌ణ్ త‌ల్లిదండ్రులు మాత్రం కాలేజీ యాజ‌మాన్యంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఒత్తిడి కార‌ణంగానే చ‌ర‌ణ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.పోలీసుల తక్షణ విచారణ చేప‌ట్టి నిజానిజాలు వెలికి తీయాల‌ని బాధిత త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళనను నిర్వహించాయి. 

Join WhatsApp

Join Now

Leave a Comment