తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) (71) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోల్‌కతాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది నెలలుగా మూత్రపిండాల సమస్యతో పాటు పలు అనారోగ్య సమస్యలతో ఆయన పోరాడుతున్నారు.
బెంగాల్ రాజకీయాల్లో (Bengal Politics) ఆయన వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. మమతా బెనర్జీకు (Mamata Banerjee) అత్యంత సన్నిహితుడిగా, తృణమూల్ కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఎదిగారు. యూపీఏ ప్రభుత్వ కాలంలో షిప్పింగ్ శాఖ సహాయమంత్రిగా, అనంతరం రైల్వే మంత్రిగా పనిచేశారు.
అయితే ఆయన రాజకీయ ప్రయాణం ఎప్పుడూ సూటిగా సాగలేదు. 2017లో టీఎంసీని వీడి భారతీయ జనతా పార్టీలో(BJP) చేరి సంచలనం సృష్టించారు. 2021 ఎన్నికల్లో కృష్ణనగర్ నార్త్ నియోజకవర్గం నుంచి గెలిచిన తరువాత మళ్లీ యూటర్న్ తీసుకుని తిరిగి టీఎంసీలో చేరడం ఆయన రాజకీయ జీవితాన్ని మరింత చర్చనీయాంశం చేసింది.
బెంగాల్ రాజకీయాల్లో వ్యూహాల మాంత్రికుడిగా గుర్తింపు పొందిన ముకుల్ రాయ్ మరణం రాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్టే అని నేతలు అభిప్రాయపడుతున్నారు.
రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత








