కోలుకున్న ముద్రగడ.. వైఎస్ జగన్‌కు లేఖ

కోలుకున్న ముద్రగడ.. వైఎస్ జగన్‌కు లేఖ

అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల చికిత్స అనంతరం కోలుకున్న వైసీపీ (YSRCP) సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తన ఆరోగ్యం విషయంలో ఆరా తీసిన మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy)కి కృతజ్ఞతలు (Thanks) తెలిపారు. ఎప్పటికప్పుడు కుటుంబానికి ధైర్యం నింపుతూ అండగా నిలిచినందుకు ఆయనకు రుణపడి ఉంటామని లేఖ‌లో పేర్కొన్నారు.

కష్టకాలంలో తమతో నిలబడ్డ వైసీపీ నాయకులు, ఇతర పార్టీల నేతలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేసిన అభిమానులందరికీ రుణపడి ఉంటానని ముద్రగడ తెలిపారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం తన కుటుంబ తరఫున వైఎస్ జగన్ చూపిన మానవీయతను గుర్తుచేసుకుంటూ ప్రత్యేక లేఖ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. త‌న ఆరోగ్య ప‌రిస్థితి కాస్త క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు మెరుగైన చికిత్స కోసం ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా విమానం ఏర్పాటు చేసిన‌ట్లుగా త‌న‌కు క‌బురు వ‌చ్చిందని, అందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment