“నా వల్లే ఈ ఓటమి”.. ధోనీ షాకింగ్ కామెంట్స్‌

"నా వల్లే ఈ ఓటమి".. ధోనీ షాకింగ్ కామెంట్స్‌

Summarize with AI

ఐపీఎల్ (IPL) సీజ‌న్ 2025లో శ‌నివారం రాత్రి ఉత్కంఠ‌భ‌రిత మ్యాచ్ జ‌రిగింది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB)తో జ‌రిగిన మ్యాచ్‌లో రెండు ప‌రుగుల తేడాతో చెన్నైసూప‌ర్ కింగ్స్ (CSK) ఓట‌మి చెందింది. ఈ సంద‌ర్భంగా సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni), RCBతో జరిగిన మ్యాచ్‌లో తమ ఓటమికి కారణం (Defeat Reason) తానేనని (Himself) షాకింగ్ ప్ర‌క‌ట‌న చేశాడు. మ్యాచ్ చివరి దశల్లో తాను కొన్ని కీలక షాట్లు ఆడలేకపోవడంతో, ఒత్తిడి పెరిగిందని ధోనీ తెలిపాడు. ఈ లోపమే జట్టు విజయాన్ని దూరం చేసిందని ఆయన అన్నాడు.

అయితే RCBకు అద్భుతమైన ఆరంభం దక్కిందని, తమ జట్టు మిడిల్ ఓవర్లలో పుంజుకున్నప్పటికీ, చివరి ఓవర్లలో షెపర్డ్ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను RCB వైపున‌కు తిప్పేశాడని ధోనీ అన్నాడు. అలాగే యువ క్రికెటర్ ఆయుష్ ధైర్యంగా, మెరిసే బ్యాటింగ్ చేశాడని ధోనీ ప్రశంసలు కురిపించాడు. గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నైపై నెగ్గిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌కు ఎంట్రీ సాధించింది. ప్లేఆఫ్స్‌కు ఎంపికైన తొలి జ‌ట్టుగా నిలిచింది. ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గాల‌నే క‌సి ఆర్సీబీ ఆట‌గాళ్ల‌లో క‌నిపిస్తుందంటున్నారు ఫ్యాన్స్‌.

Join WhatsApp

Join Now

Leave a Comment