సుదీర్ఘ విచారణ అనంతరం లిక్కర్ కేసు (Liquor Case)లో వైసీపీ (YSRCP) ఎంపీ (MP) మిథున్ రెడ్డి (Mithun Reddy)ని సిట్ (SIT) అధికారులు అరెస్ట్ (Arrest) చేశారు. శనివారం రాత్రి 8.45కు అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఆయనను ఆరేడు గంటలపాటు విచారించిన అనంతరం మిథున్ రెడ్డికి ముందుగా నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రేపు కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈ కేసులో మిథున్ రెడ్డిని ఏ4 నిందితుడిగా పేర్కొన్నట్టు సిట్ స్పష్టం చేసింది. సిట్ అధికారులు అరెస్ట్ చేయడం కంటే ముందుగానే టీడీపీ(TDP) అనుకూల మీడియా మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను ధ్రువీకరించి ప్రసారాలు నడపడం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఎంపీ అరెస్ట్‌పై వైసీపీ నేతలు(YSRCP Leaders) తీవ్రంగా మండిపడుతున్నారు. లిక్కర్ కేసు పేరిట కనీస ఆధారాలు చూపకుండానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని వారు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్ (Y.S. Jagan)కు అత్యంత సన్నిహితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. “కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోంది. మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం. ఇది కుట్రపూరితమైన చర్య. జగన్ టార్గెట్‌గా చంద్రబాబు (Chandrababu) కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు” అని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్‌ను ఖండిస్తూ #WeStandWithMithun హ్యాష్‌ట్యాగ్‌తో నిరసన వ్యక్తం చేస్తోంది.
చంద్రబాబు తన అనుకూల మీడియాతో వైసీపీ నేతలపై దుష్ప్రచారం చేయించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని, రెడ్‌బుక్ రాజ్యాంగం (Red Book Constitution) పేరిట అక్రమ కేసులు నమోదు చేస్తూ విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. “ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం న్యాయస్థానాల్లో పోరాటం సాగిస్తాం. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమ కేసులతో ప్రజలను భయపెడుతోందని ఆరోపిస్తున్నారు.