‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) లో భాగంగా బవహల్పూర్ (Bahawalpur) లోని జైష్-ఎ-మహమ్మద్ (Jaish-e-Mohammad) ప్రధాన స్థావరమైన సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై (Subhan Allah Complex) ఇండియన్ ఆర్మీ (Indian Army) బాంబులు దాడి చేసింది. ఈ దాడిలో జైష్-ఎ-మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) కుటుంబానికి చెందిన 10 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అందులో అతడి అక్క, బావ, మేనల్లుడు, భార్య కూడా ఉన్నారు.
ఈ దాడికి ప్రతిగా, మసూద్ అజార్ భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేశాడు. కశ్మీర్ (Kashmir) విషయంలో ప్రధాని మోడీ అన్ని నియమాలను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మసూద్ అజార్ లేఖలో “నేను కూడా చనిపోతే బాగుండేదని” పేర్కొన్నాడు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని, ఏ మాత్రం జాలి చూపబోమని మసూద్ అజార్ హెచ్చరికలు జారీ చేశాడు. “భయం లేదు, నిరాశ లేదు, దుఖం లేదు” అని చెబుతూ విడుదల చేసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇది భారత్, పాకిస్తాన్ (Pakistan) మధ్య తీవ్రమైన ఉద్రిక్తత పెంచే అంశంగా మారింది.