గుర్తుపట్టలేని స్థితిలో ఏపీ బ‌స్సు ప్ర‌మాద మృతదేహాలు

గుర్తుపట్టలేని స్థితిలో ఏపీ బ‌స్సు ప్ర‌మాద మృతదేహాలు

Summarize with AI

ఆంధ్ర‌రాష్ట్రంలోని (Andhra Pradesh) రాయవరం సమీపంలో తెల్ల‌వారుజామున జరిగిన ఘోర బస్సు (Bus Accident) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. మంటల తీవ్రతకు బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో, లోపల ఉన్న ప్రయాణికుల మృతదేహాలు (Dead Bodies) పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేనంతగా (Unrecognizable), మాంసపు ముద్దలుగా మారాయి.

డీఎన్ఏ పరీక్షలే కీలకం
ప్రస్తుతం 13 మృతదేహాలను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి (Markapur Government Hospital) తరలించారు. అయితే, మృతదేహాలు కాలిపోయిన స్థితిని బట్టి సాధారణ పద్ధతుల్లో వారిని గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం డీఎన్ఏ (DNA) పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. మృతదేహాల నుంచి శాంపిల్స్ (Samples) సేకరించేందుకు నెల్లూరు నుంచి ప్రత్యేక ఫొరెన్సిక్ నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నారు. మృతుల బంధువుల నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలతో వీటిని సరిపోల్చి, ఆ తర్వాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

క్షతగాత్రుల పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరికి శరీరంలో 70 శాతానికి పైగా కాలిన గాయాలవ్వడంతో, మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి (Ongole RIMS Hospital)తరలించారు. మిగిలిన బాధితులకు మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వస్తుండటంతో.. మృతులంతా ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల సరిహద్దు గ్రామాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. తమ వారు ఇంటికి వస్తారని ఆశగా ఎదురుచూసిన కుటుంబ సభ్యులు, ఈ వార్త వినగానే కన్నీరుమున్నీరవుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment