రిన్యూ ప‌వ‌ర్ ప్రాజెక్ట్‌.. వైసీపీకి దొరికిపోయిన మంత్రి లోకేష్‌

రిన్యూ ప‌వ‌ర్ ప్రాజెక్ట్‌.. వైసీపీకి దొరికిపోయిన మంత్రి లోకేష్‌

రిన్యూ ఎన‌ర్జీ ప్రాజెక్ట్‌పై ఏపీ (Andhra Pradesh)లో అధికార తెలుగుదేశం, విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ‘సోష‌ల్’ వార్ (Social War) న‌డుస్తోంది. గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్రం నుంచి రిన్యూ ప్రాజెక్ట్‌ను త‌రిమేశార‌న్న మంత్రి లోకేష్ ట్వీట్‌ను ఆధారాల‌తో వైసీపీ తిప్పికొడుతోంది. జ‌గ‌న్(Jagan) హ‌యాంలో జ‌రిగిన రిన్యూ ప్రాజెక్టు శంకుస్థాప‌న‌, భూ కేటాయింపులు, జీవో, ఒప్పందం వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నారా లోకేష్ వ్యాఖ్య‌లు ప‌చ్చి అబ‌ద్ధాలని మండిప‌డుతున్నారు.

వైఎస్ జ‌గ‌న్(YS Jagan) హ‌యాంలో ప్రారంభమైన పెట్టుబడి ఒప్పందాలను తమ కృషిగా చెప్పుకుంటూ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. “Renew Power” సంస్థను వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రం నుండి వెళ్లగొట్టిందని లోకేష్(Lokesh) చేసిన వ్యాఖ్యలు తప్పుడు అని రుజువైనట్టు వైసీపీ శ్రేణులు ఆధారాలు బ‌హిర్గ‌తం చేస్తున్నాయి. క్రెడిట్ చోరీలో తండ్రిని మించిపోయావ‌ని లోకేష్‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

వాస్త‌వానికి Renew సంస్థతో వైఎస్ జగన్ ప్ర‌భుత్వ‌ హ‌యాంలోనే పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో Renew కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో 600 మెగావాట్లు, 300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు భూములు కూడా కేటాయించబడ్డాయి. 2023 జూన్ 20న Renew ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తూ జీవో నెం.15 జారీ కాగా, 2024 ఫిబ్రవరి 5న రెండో ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇచ్చారు.

ఈ రెండు జీవోలకు సంతకాలు చేసిన వ్యక్తి ప్రస్తుత సీఎస్, ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ కావడం గమనార్హం. ఇవన్నీ అధికార రికార్డుల్లో ఉన్నప్పటికీ, Renew Power సంస్థను జగన్ ప్రభుత్వం తరిమేసిందంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్‌తో ఆయన తీవ్రంగా అభాసుపాలయ్యారు. దీనిపై వైసీపీ నేతలు వీడియోలను విడుదల చేయగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నారా లోకేష్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment