బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

పశ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి దేశంలోకి చొరబడుతున్న వారిని బీఎస్‌ఎఫ్ వదిలేస్తూ త‌న రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె విమర్శించారు. ‘‘ఇస్లాంపూర్, సిటాయ్, చోప్రా వంటి సరిహద్దుల ప్రాంతాల ద్వారా ప్రవేశించే చొరబాటుదార్లకు బీఎస్‌ఎఫ్‌ సహాయం చేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది’’ అని మమత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ప్రతిపక్షాలు, బీఎస్‌ఎఫ్‌పై ఆరోపణలు
సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్య‌ల ప్రకారం, కొన్ని టీవీ ఛానెళ్లు టీఆర్‌పీ కోసం టీఎంసీపై దుష్ప్రచారం చేస్తున్నాయని, అయితే బీఎస్‌ఎఫ్ జవాన్లు మహిళలను చిత్ర హింసలకు గురిచేస్తూ రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రేరేపిస్తున్నారని అన్నారు. అయితే బీఎస్‌ఎఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ వ్యాఖ్య‌ల‌ను ఖండించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment