ఎన్టీఆర్-నీల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కేజీఎఫ్, సలార్ సినిమాల డైరెక్ట‌ర్‌ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ పై మేకర్స్ నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న టైటిల్ ప్రకారం ఈ సినిమాను ‘డ్రాగన్’ (Dragon) అనే పేరుతో రూపొందిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ మూవీని 2026 జూన్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా (Pan India) స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రం.. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ గ్రాండ్ రిలీజ్ కానుంది.

మే 20న స్పెషల్ గ్లింప్స్ విడుదల
తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా గ్లింప్స్‌ను (Special Glimpses) విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ అప్డేట్‌తో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. మరోవైపు, ఈ నెల 22న ఎన్టీఆర్ షూటింగ్‌ జాయిన్ అయ్యారు. యాక్షన్ పార్ట్‌లతోపాటు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను కలిపి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment