తెలంగాణ (Telangana)లో మహిళ (Women)లకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణాలను అందిస్తున్న మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) విజయవంతంగా కొనసాగుతోందని డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయనిచ ఎప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) ఎంజీబీఎస్ బస్టాండ్ (MGBS Bus Stand))లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మహాలక్ష్మి ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ “మహిళలు ఉచిత ప్రయాణాల వల్ల ఇప్పటివరకు రూ.6,680 కోట్లు ఆదా చేసుకున్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. ఇది మునిగిపోతున్న పడవ కాదు, లాభాల్లోకి వస్తున్న ఆర్టీసీ(RTC)” అని వ్యాఖ్యానించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ పునరుత్తేజం పొందిందని స్పష్టం చేశారు.
ఉచిత ప్రయాణాల ప్రారంభం తర్వాత RTC ఆక్యుపెన్సీ 62% నుండి 97% కి పెరిగిందన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే, ప్రస్తుతం ఇది 65 లక్షల మందికి చేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2400 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని చెప్పారు. “RTC ప్రయాణికులుగా మాత్రమే కాకుండా, మహిళలను RTC బస్సుల యజమానులుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాం. వడ్డీలేని రుణాల ద్వారా బస్సులు కొనుగోలు చేసే అవకాశం కల్పించాం. ఇప్పటివరకు 150 మహిళా సంఘాలకు కోటి రూపాయల విలువైన చెక్కులు అందించాం” అని వివరించారు.