మెగా ఫ్యామిలీపై ట్రోల్స్‌కు లావణ్య గట్టి కౌంటర్!

మెగా ఫ్యామిలీపై ట్రోల్స్‌కు లావణ్య గట్టి కౌంటర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్–ఉపాసన దంపతులకు ఇటీవల కవలలు జన్మించడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని మీడియాతో పంచుకోవడం అభిమానులను ఆనందపరిచింది. అయితే గతంలో ఆయన సరదాగా చేసిన “వారసుడు కావాలి” అనే వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభించారు. ‘క్లింకార పుట్టినప్పుడు ఇంత సంబరం లేదు, ఇప్పుడు అబ్బాయి పుట్టగానే హడావిడి చేస్తున్నారా?’ అంటూ చేసిన ఒక ట్వీట్ వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఇంత సంతోషకరమైన క్షణాన్ని అసహ్యంగా మార్చొద్దు. మీకు నిజాలు తెలియకుండా మాట్లాడొద్దు. చిరంజీవి గారు తన కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా మనవరాళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆయన చేసే పనిలో ఒక్క శాతం కూడా చాలా మంది చేయలేరు’ అంటూ ఆమె గట్టిగా బదులిచ్చారు. తాజాగా ఆమె నటిస్తున్న ‘సతి లీలావతి’ సినిమా ప్రెస్ మీట్‌లోనూ ఇదే విషయంపై ప్రశ్నించగా, ‘నా కుటుంబంపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను మౌనం పాటించను’ అని స్పష్టం చేశారు. మెగా కోడలిగా కుటుంబానికి అండగా నిలిచిన లావణ్య ధైర్యాన్ని అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment