లడఖ్‌లో 30 అడుగుల శివాజీ విగ్రహం ఆవిష్కరణ

లడఖ్‌లో 30 అడుగుల శివాజీ విగ్రహం ఆవిష్కరణ

లడఖ్‌లోని పాంగోంగ్ త్సో వద్ద 30 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక చారిత్రక ఘనతగా నిలిచింది. బీజేపీ ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్, భారత సైన్యం సమక్షంలో ఈ విగ్రహాన్ని ఆవిష్క‌రించారు. ఈ విగ్రహం మరాఠా యోధుని శౌర్యం, నాయకత్వాన్ని, దేశానికి చేసిన అగ్రస్ధాన సేవలను గౌరవించేలా రూపొందించబడింద‌న్నారు. ఈ విగ్రహం శివాజీ మహారాజ్ యొక్క సైనిక పరాక్రమం, పరిపాలనా నైపుణ్యాలు, సమానత్వం మరియు న్యాయానికి చేసిన కృషిని గుర్తుచేస్తుంద‌న్నారు. 14,300 అడుగుల ఎత్తులో ఉన్న పాంగోంగ్ త్సో ఒడ్డున ఈ విగ్రహం ఏర్పాటు చేయ‌బ‌డింది. లడఖ్‌ ప్రజల మనస్సుల్లో శివాజీ మహారాజ్‌ ఆత్మను మరింత బలంగా నిలిపేందుకు ఈ విగ్ర‌హం దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment