వీడిన జంట హ‌త్యల‌ కేసు మిస్ట‌రీ.. నిందితుల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు

వీడిన జంట హ‌త్యల‌ కేసు మిస్ట‌రీ.. నిందితుల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు

Summarize with AI

కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన చిన్నగొల్లపాలెం జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో జరిగిన ఈ హత్యల వెనుక చేపల వేటకు సంబంధించిన పాత గొడవలే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

జూన్ 27న చిన్నగొల్లపాలెంకు చెందిన మామా–అల్లుళ్లు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను దారుణంగా హత్య చేసిన నిందితులు.. అనంతరం మృతదేహాలను తాళ్లతో బైక్‌కు కట్టి కొత్త కాలువలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

బందరు డీఎస్పీ జి. శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. చేపల వేటకు సంబంధించిన పాత విభేదాలను మనసులో పెట్టుకున్న నిందితులు ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు తెలిపారు.

ఈ కేసులో శంకరపు శ్రీనివాస్, జెల్ల నాగరాజు, కటికల కళ్యాణ్, డొక్కుమాల శ్రీకాంత్, షేక్ అబ్దుల్ ఖాదర్ జిలాని, అబ్బూరి విజయరత్నం (దాసు)లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో పెడనకు చెందిన శంకరపు శ్రీనివాస్, జెల్ల నాగరాజు, గుడివాడకు చెందిన కటికల కళ్యాణ్, డొక్కుమాల శ్రీకాంత్, షేక్ అబ్దుల్ ఖాదర్ జిలాని టీడీపీ కార్యకర్తలుగా అని, వీరు టీడీపీ నేత‌ల‌తో స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన AP16 TP 2283 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు, AP37 CX 1196 నంబర్ గల పల్సర్ మోటార్ సైకిల్, ఏడు మొబైల్ ఫోన్లు, ఒక కత్తి, ఒక ఇనుప రాడ్డు, ఒక సరుగుడు కత్తి, ఘటన సమయంలో ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంచలన కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment