కొండా సురేఖ(Konda Surekha, కడియం శ్రీహరి (Kadiyam Srihari) మధ్య రాజకీయ విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ, ఆయనపై ఏఐసీసీ (AICC) నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గతంలోనూ ఇద్దరూ ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ, ఇటీవల వారి మధ్య సయోధ్య నెలకొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలతో మరోసారి ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల కడియం శ్రీహరి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ఉమ్మడి వరంగల్‌కు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ అంశంపై ఏఐసీసీ అధిష్ఠానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) కూడా ఆమె లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.








