ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్‌ రాహుల్‌

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్‌ రాహుల్‌

టీమిండియా క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL)లో గోవా గార్డియన్స్‌ అనే జట్టుకు ఆయన సహ యజమానిగా వ్యవహరించనున్నారు. ఈ సీజన్‌తోనే వాలీబాల్ లీగ్‌లోకి అడుగుపెడుతున్న గోవా గార్డియన్స్‌ జట్టు, హైదరాబాద్‌లో అక్టోబర్ 2 నుంచి 26 వరకు జరిగే పీవీఎల్‌ టోర్నీలో పాల్గొంటుంది. ఈ జట్టుకు రాజు చేకూరి ప్రధాన యజమానిగా ఉన్నారు.

కీలక మలుపు

ఈ కొత్త భాగస్వామ్యం గురించి రాహుల్ మాట్లాడుతూ, “భారత క్రీడా ప్రపంచంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఒక కీలక మలుపు. ఇది ప్రేక్షకులకు మరింత చేరువవుతూ క్రీడ స్థాయిని పెంచుతుంది. చిన్నప్పటి నుంచి వాలీబాల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ లీగ్‌లో భాగం కావడం సంతోషంగా ఉంది,” అని పేర్కొన్నారు.

క్వింటన్ డికాక్ వన్డేలకు పునరాగమనం, బవుమాకు గాయం

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ తాను తీసుకున్న వన్డే క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో పాకిస్తాన్‌లో పర్యటించే దక్షిణాఫ్రికా జట్టుకు అతన్ని ఎంపిక చేశారు. 2023లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత డికాక్ రిటైర్ అయ్యారు.

ప్రస్తుత సఫారీ కోచ్ శుక్రి కాన్‌రాడ్ డికాక్ తిరిగి జట్టులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది జట్టుకు బలాన్నిస్తుందని అన్నారు. అయితే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) గదను అందించిన కెప్టెన్ తెంబా బవుమా గాయం కారణంగా పాక్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యారు. ఈ సిరీస్ వచ్చే నెలలో లాహోర్, రావల్పిండిలలో జరగనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment