ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ (Prakash Raj)కు కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. దేవనహళ్లి (Devanahalli)లో పరిశ్రమల కోసం భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు (Farmers) చేస్తున్న ధర్నా (Protest)లో ప్రకాష్ రాజ్ పాల్గొనడంపై కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ (M.B. Patil) అభ్యంతరం వ్యక్తం చేశారు.
బెంగళూరు (Bengaluru)లో మీడియాతో మాట్లాడిన పాటిల్, పరిశ్రమల స్థాపనకు ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు భూములు లభిస్తున్నాయని, భూసేకరణ తప్పనిసరి అని అన్నారు. దేవనహళ్లి రైతులకు మద్దతుగా పోరాడుతున్న ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున భూములు స్వాధీనం చేసుకుంటున్నారు, అక్కడ రైతులకు మద్దతుగా పోరాడితే మంచిది అని సలహా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో భూసేకరణ వివరాలు
ప్రకాష్ రాజ్ కర్ణాటక కంటే ఆంధ్ర, తమిళనాడులో ఎక్కువ ప్రసిద్ధి చెందారని పేర్కొన్న మంత్రి పాటిల్, కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. కర్ణాటకలో హైటెక్ డిఫెన్స్ ( Hi-Tech Defence), ఏరోస్పేస్ పార్క్ (Aerospace Park) కోసం కేవలం 1200 ఎకరాల భూమిని మాత్రమే స్వాధీనం చేసుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇదే అవసరం కోసం మడకశిర నుండి పెనుకొండ వరకు 10,000 ఎకరాలను సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ అవసరాల పేరుతో రైతుల నుండి మొత్తం 45,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. విశాఖపట్నం (Visakhapatnam)లో ఒక ఎకరం భూమిని కేవలం 95 పైసలకు కట్టబెడుతున్నారని తెలిపారు. ఈ పరిణామాలు ప్రకాష్ రాజ్ కళ్లకు కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. మంత్రి సవాల్‌కు ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
కాగా, ఏపీలోని విలువైన భూములను రూపాయి కంటే తక్కువకు కేటాయిస్తున్నారనే అంశం కర్ణాటకలో కూడా చర్చనీయాంశం కావడం గమనార్హం.








