Karnataka: 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం… కర్ణాటక ప్రభుత్వ సంచలన నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు (Children below 16 years) సోషల్ మీడియా (Social Media) వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. 2026–27 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ అసెంబ్లీలో (Assembly) ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వినియోగం, సోషల్ మీడియా వ్యసనం, ఆన్‌లైన్ భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అధిక స్క్రీన్ టైమ్ వల్ల పిల్లల ఆరోగ్యం, చదువుపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.

దేశంలో చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా నియంత్రణపై (Social Media Regulation) చర్చ కొనసాగుతోంది.

అయితే నిపుణులు మాత్రం పూర్తిగా నిషేధం అమలు చేయడం సులభం కాదని చెబుతున్నారు. అధిక స్మార్ట్‌ఫోన్ వినియోగం వల్ల పిల్లల్లో నిద్రలేమి, ఆందోళన, చదువుపై దృష్టి తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా విద్యా అవకాశాలు (Educational Opportunities), సృజనాత్మకతకు (Creativity) కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment