రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ అయిన ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. ట్రైలర్‌లో రిషబ్ శెట్టి భయపెట్టే లుక్‌లో కనిపించి, సినిమాపై అంచనాలను మరింత పెంచారు. హీరోయిన్ రుక్మిణి వసంత మహారాణి పాత్రలో మెప్పించారు. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

2022లో వచ్చిన ‘కాంతార’ సినిమా కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్‌తో రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసి పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాతే దీనికి ప్రీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ‘కాంతార చాప్టర్ 1’ కోసం ప్రేక్షకులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’