ఇటీవల విడుదలైన ఆస్కార్ 2025 నామినేషన్ జాబితాలో భారతీయ సినిమాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం ఆస్కార్ పోటీలో చోటు దక్కించుకోవడం తమిళ ఇండస్ట్రీకి గర్వకారణంగా మారింది. అంతేకాక, మాలీవుడ్ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ కూడా ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలోకి ఎంపికై, భారతీయ చిత్ర పరిశ్రమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పింది. ఇవే కాకండా ఇండియా నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాల్లో హిందీ నుంచి సంతోష్, ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం), స్వాతంత్ర వీర సావర్కర్ లు కూడా బరిలో నిలిచాయి. ఇక అకాడమీ షార్ట్‌లిస్ట్ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది.
News Wire
-
01
సుప్రీం కోర్టులో వైసీపీ పిటిషన్
మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్లు అడ్డుకోవడంపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్. ఏకగ్రీవాలపై స్టే విధించాలని పిటిషన్
-
02
టీమిండియా సెలక్షన్ కమిటీకి కొత్త ఛైర్మన్
బీసీసీఐ పురుషుల జట్టుకు సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ప్రజ్ఞాన్ ఓజా నియామకం.
-
03
టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు
ముంబైలోని జుహూ ప్రాంతంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు. పోలీసుల అదుపులో ముగ్గురు.
-
04
తెలంగాణకు వర్ష సూచన..
తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వానలు కురిసే అవకాశం.
-
05
మరో నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. ఈనెల 21 నుంచి 23వరకు నామినేషన్ల స్వీకరణ. నవంబర్ 3న పోలింగ్
-
06
నామినేషన్లకు నేడే చివరి రోజు
అక్టోబర్ 28న మున్సిపల్ పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు. అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణకు గడువు.
-
07
పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులు
తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులు. పుంగనూరు వెళ్లకూడదంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు.
-
08
పులివెందులలో టెన్షన్.. టెన్షన్..
అవినాష్ రెడ్డి ఇల్లు, వైయస్ఆర్సీపీ ఆఫీసు దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. వైసీపీ ఆఫీసు, ఆడిటోరియం చుట్టూ ముళ్లకంచె ఏర్పాటు.
-
09
తిరుపతిలో నామినేషన్ పత్రాలు చించివేత
వైసీపీ మేయర్ అభ్యర్ధి నామినేషన్ పత్రాలు చూపించగానే లాక్కుని చించేసిన టీడీపీ శ్రేణులు. ఎంపీ గురుమూర్తిని అడ్డుకున్న పోలీసులు.
-
10
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం
దసరా వేళ విషాదం. ఈతకు వెళ్లి డ్యామ్లోలో చిక్కుకుని ఐదుగురు మహిళలు దుర్మరణం.








