తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టు అక్రమాలు, వ్యయవృద్ధిపై విచారణ జరుపుతున్న కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) తాజాగా ముగ్గురు ప్రముఖ రాజకీయ నాయకులకు నోటీసులు (Notices) జారీ చేసింది.
బీఆర్ఎస్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao), మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (T. Harish Rao), బీజేపీ నేత ఈటల రాజేందర్ (Etela Rajender)లకు ఈ నోటీసులు అందినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, వ్యయాలు, సాంకేతిక ప్రక్రియలపై వివరణ ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది.
కమిషన్ పంపిన నోటీసుల్లో.. ప్రాజెక్టు సంబంధిత అంశాలపై 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ప్రజాధనం వృథా అయిందా? వ్యవస్థాపిత విధానాలను లంగించారా? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారడం గమనార్హం.
”మన టైం వస్తుంది.. సినిమా చూపిస్తాం”.. – చిటికేసి మరీ చెప్పిన జగన్