కాకినాడ‌లో పార్శిల్ దింపుతుండ‌గా పేలుడు.. (వీడియో)

కాకినాడ‌లో పార్శిల్ దింపుతుండ‌గా పేలుడు.. (వీడియో)

Summarize with AI

కాకినాడలోని బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో సోమవారం భయంకరమైన పేలుడు సంభ‌వించింది. స్థానిక వార్పు రోడ్డులో ఉన్న జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో బాణసంచా పార్సిల్ దింపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో హమాలీలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్ (Government General Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బ్లాస్టింగ్ జ‌రిగిన ప్ర‌దేశాన్ని పోలీసు ఉన్న‌తాధికారులు సంద‌ర్శించారు. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన చిన్న చిన్న క్రాకర్స్ పార్శిల్ వచ్చాయని, ఆ మూటను ఒక్కసారిగా కింద పడేయడంతో ప్రమాదం జ‌రిగిన‌ట్లుగా ప్రాథమిక స‌మాచారం. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తత రేపగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment