రుస్తుం మైనింగ్ (Rusthum Mining) కేసు (Case)లో వైసీపీ నేత(YSRCP Leader), మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)కి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టు(High Court) షరతులతో కూడిన బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఈ కేసుతో కలిపి ఆయనపై నమోదైన మొత్తం ఎనిమిది కేసుల్లో బెయిల్ లభించడంతో, 80 రోజులుగా నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉన్న కాకాణి నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. కోర్టు ఆయన పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని షరతు విధించింది.
అన్ని కేసుల్లోనూ కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ రావడంతో కుటుంబ సభ్యులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన కుమార్తె మాట్లాడుతూ.. “నాన్నపై నమోదైన ఎనిమిది కేసులు అక్రమమైనవని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని” ఆరోపించారు. 80 రోజులకు పైగా మానసిక క్షోభను అనుభవించిన కుటుంబం, ముఖ్యంగా కాకాణి తల్లి తీవ్ర మనస్థాపం చెందినట్లు ఆమె తెలిపారు. కాకాణి విడుదల సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది, వైసీపీ నాయకులు ఈ కేసులను “రాజకీయ కక్ష”గా అభివర్ణిస్తున్నారు. రుస్తుం మైనింగ్ కేసులో కాకాణిని ఏ4గా చేర్చగా, బొగ్గు అక్రమ రవాణా, గిరిజనులను బెదిరించడం వంటి ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. నెల్లూరు ప్రజలకు కాకాణి గోవర్ధన్ రెడ్డి గురించి బాగా తెలుసనివైసీపీ నేతలు పేర్కొన్నారు.