బాలీవుడ్ (Bollywoodలో అత్యంత భారీగా రూపొందుతున్న ప్రాజెక్ట్ ‘రామాయణ్’ (Ramayan). ఈ సినిమాలో యష్ (Yash) రావణాసురుడిగా, రణబీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా నటిస్తున్నారు. అయితే, ఇందులో రాక్షస రాజు రావణాసురుని భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఎంపికైనట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ నుంచి కాజల్‌ను తప్పించినట్లు బాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆమె స్థానంలో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఎంపికైందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియా ట్రోల్సే కారణమా?
కాజల్ అగర్వాల్ ‘మండోదరి’ (Mandodari) పాత్రలో నటిస్తే, సాయి పల్లవి దగ్గరకు రావణాసురుడైన యష్ ఎందుకు వెళ్తాడు? అంటూ సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా కామెంట్లు వినిపించాయి. అంతేకాదు, చాలామంది ఇది ‘రాంగ్ సెలక్షన్’ అని, “ఒకటి సాయి పల్లవిని ఆ క్యారెక్టర్ నుంచి మార్చండి, లేదంటే కాజల్‌నైనా ఈ సినిమా నుంచి తీసేయండి” అంటూ రకరకాలుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు.
దీంతో, హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను రామాయణ్ ప్రాజెక్ట్ నుంచి తీసేశారన్న వార్త వైరల్ అవుతోంది. మరో విషయం ఏంటంటే, కాజల్‌ను మండోదరి పాత్రకు ఎంపిక చేసుకోకముందు వరకు ఈ సినిమా హ్యాష్‌ట్యాగ్‌లు చాలా బాగా ట్రెండ్ అయ్యేవట. సాయి పల్లవిపై కూడా మంచి అభిప్రాయం ఉండేదట. కానీ, కాజల్‌ను ఎంపిక చేసుకున్నాకే ఈ తలనొప్పులు మొదలయ్యాయట. దీంతో ఆమెను తీసేసి మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.