జోగి రమేష్ అరెస్టు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

జోగి రమేష్ అరెస్టు.. మైలవరంలో ఉద్రిక్తత

బూడిద అక్ర‌మ (Ash Illegal) త‌ర‌లింపున‌కు (Transportation) నిర‌స‌న‌గా వైసీపీ(YSRCP) చేప‌ట్టిన ఆందోళ‌న తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారితీసింది. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో వైసీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి నివాసం వ‌ద్ద అటు పోలీసులు, ఇటు వైసీపీ కార్య‌క‌ర్త‌లు భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెలకొంది. మూలపాడు (Moolapadu)లోని VTPSలో అక్రమంగా నిల్వ ఉంచిన ఫ్లయాష్‌ (Fly-Ash)ను స్థానిక లారీ యజమానులకు పంపిణీ చేయాలని మాజీ మంత్రి జోగి ర‌మేష్ (Jogi Ramesh)  గ‌త కొంత‌కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టిడిపి నేతల బూడిద తరలింపునకు వ్యతిరేకంగా నేడు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో అక్రమంగా నిలువచేసిన బూడిద డంపు పరిశీలనకు పిలుపునివ్వ‌డంతో వైసీపీ కార్యకర్తలు జోగి ర‌మేష్ ఇంటికి భారీగా చేరుకున్నారు.

మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయినా, కార్యకర్తలతో క‌లిసి మాజీ మంత్రి జోగి రమేష్ మూల‌పాడు ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేర‌గా పోలీసులు అడ్డుకుని అరెస్ట్(Arrest) చేశారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. జోగి రమేష్‌ను భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నాయకులను, కార్యకర్తలను నిలువరించారు. ఈ సందర్భంగా, కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు “రెడ్ బుక్ రాజ్యాంగం డౌన్ డౌన్”(Redbook Constitution Down Down) అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment