జయలలిత ఆస్తులపై బెంగ‌ళూరు కోర్టు కీల‌క ఆదేశాలు

జయలలిత ఆస్తులపై బెంగ‌ళూరు కోర్టు కీల‌క ఆదేశాలు

తమిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి, అన్నాడీఎంకే కీల‌క నేత‌ స్వ‌ర్గీయ జయలలిత (Jayalalitha) ఆస్తుల‌కు సంబంధించిన కేసులో బెంగ‌ళూరు స్పెష‌ల్ కోర్టు కీల‌క తీర్పు వెల్ల‌డించింది. జ‌య‌ల‌లిత‌కు చెందిన (Jayalalitha Properties) 4 వేల కోట్ల రూపాయ‌ల‌కు సంబంధించి ఆస్తులను ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వానికి అప్పగించాలని స్పెషల్ కోర్టు ఉత్తర్వులు(Court Order) జారీ చేసింది.

బెంగ‌ళూరు స్పెష‌ల్ కోర్టు ఆదేశాల‌ మేరకు కర్ణాటక ప్రభుత్వం 1,562 ఎకరాల భూమిని, 27 కిలోల బంగారు వజ్రాభరణాలను, 10 వేల‌కు పైగా చీరలను, 750కి పైగా చెప్పుల జతలను, వాచ్లను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనుంది. దశాబ్దం క్రితం ఈ ఆస్తుల విలువ రూ.913 కోట్లు కాగా, ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ.4,000 కోట్లకు చేరుకుంది. ఈ ఆస్తుల సముదాయాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం తమిళనాడులో కీలక పరిణామంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment