ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాల్లో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM-Chandrababu) కు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Y. S. Jagan) ప్రత్యేక ధన్యవాదాలు (Special Thanks) చెప్పారు. థ్యాంక్స్ చెబుతూనే చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆక్వా రైతుల సమస్యలపై చంద్రబాబు నిర్వహించిన సమీక్షపై స్పందించిన జగన్, తన ట్వీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“చంద్రబాబు గారూ… ఆక్వా రైతుల (Aqua Farmers) కష్టాలను మా పార్టీ నాయకులు వెలుగులోకి తీసుకురావడం, నేను చేసిన ట్వీట్ తరువాత మీరొక సమీక్ష నిర్వహించినందుకు ధన్యవాదాలు. కానీ మీ సమీక్ష ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్నది నా దృష్టికి వచ్చింది” అంటూ జగన్ ట్వీట్ (JaganTweet) చేశారు. మీ సమావేశాలు, మీరు చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు నిజంగా మేలు చేసేలా ఉండాలి.
ఆక్వా రైతుల పెట్టుబడిలో రొయ్యలకు వేసే మేత ప్రధానమైనది. గతంలో ఈ ఫీడ్‌పై 15% సుంకం విధించినప్పుడు కంపెనీలన్నీ కిలోకు రూ.6.50లు చొప్పున పెంచారు. ఫీడ్ తయారు చేసే ముడిసరుకులపై ఇప్పుడు సుంకం 15% నుంచి 5%కి తగ్గింది. అలాగే సోయాబీన్ రేటు కిలోకు గతంలో రూ.105లు ఉంటే ఇప్పుడు రూ.25లకు పడిపోయింది. మరి ముడిసరుకుల రేట్లు ఇలా పడిపోయినప్పుడు ఫీడ్ రేట్లు కూడా తగ్గాలి కదా? ఎందుకు తగ్గడంలేదు? ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు వైఎస్ జగన్.
అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలన్నీకూడా 50 కౌంట్ లోపువే. అమెరికాకూడా మన దేశంపై విధించిన టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి కదా? ఎందుకు పెరగడంలేదు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (Andhra Pradesh Aquaculture Development Authority) కింద ఎంపెవరింగ్ కమిటీ (Empowering Committee) ఉండేదని, ఆ కమిటీని ఇప్పుడు అచేతనంగా మార్చేశారు. వెంటనే దీన్ని పునరుద్ధరిస్తూ రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
1. @ncbn గారూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 10, 2025








