జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు.. అసెంబ్లీ వ‌ద్ద‌ ఉద్రిక్తత

జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు.. అసెంబ్లీ వ‌ద్ద‌ ఉద్రిక్తత

Summarize with AI

తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంట‌కండ్ల‌ జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయాన్ని వెల్ల‌డించారు. స్పీకర్‌పై అభ్యంత‌రక‌ర‌ వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సస్పెన్షన్ బ‌డ్జెట్ సెషన్ ముగిసేంతవరకు కొనసాగనుంది అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గ‌డ్డం ప్ర‌సాద్‌ ప్రకటించారు.

సస్పెన్షన్‌ ఉత్తర్వులు వెలువడిన వెంటనే, జగదీశ్ రెడ్డి సభను విడిచిపెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు, అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో సభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment