ఆసియా కప్ (Asia Cup) 2025లో భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో భాగంగా గ్రూప్-ఎలో యూఏఈ జట్టును 41 పరుగుల తేడాతో ఓడించి పాకిస్తాన్ జట్టు సూపర్ 4కు అర్హత సాధించింది. దీంతో, సెప్టెంబర్ 21న దుబాయ్ వేదికగా జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు మళ్లీ తలపడనున్నాయి.
గత ఆదివారం జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం (హ్యాండ్ షేక్) చేయకపోవడం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిని తీవ్ర అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే, కరచాలనం తప్పనిసరి అని రూల్ బుక్‌లో లేకపోవడంతో ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సూపర్-4 మ్యాచ్‌లో కూడా భారత జట్టు కరచాలనం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.








