INDvsNZ : న్యూజిలాండ్ టార్గెట్ 250

ICC Champions Trophy : న్యూజిలాండ్ టార్గెట్ 250

Summarize with AI

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి 249 ప‌రుగులు చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 6.4 ఓవర్లలో 30 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (2), విరాట్ కోహ్లీ (11) ఔటయ్యారు. ఆ త‌రువాత వ‌చ్చిన శ్రేయ‌స్సు అయ్య‌ర్ 79 ప‌రుగులు చేసి జ‌ట్టును ఆదుకున్నాడు. అక్ష‌ర్‌ప‌టేల్ 42 ప‌రుగులు, హార్దిక్ పాండ్యా 45 ప‌రుగులు చేసి స్కోర్‌ను ముందుకు న‌డిపారు.

బ్యాటింగ్‌కు దిగిన టాప్ ఆర్డ‌ర్లంతా న్యూజిలాండ్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొనందుకు త‌డ‌బ‌డి వికెట్లు స‌మ‌ర్పించారు. మిడిలాడ‌ర్లు కాస్త నెమ్మ‌దిగా ఆడి జ‌ట్టును ఆదుకున్నారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ 42 ప‌రుగులు ఇచ్చి 5 కీల‌క వికెట్లు తీశాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment